స్క్రబ్ టైఫస్: ఈ పురుగు కుడితే చనిపోవడమేనట తస్మాత్ జాగ్రత్త
- masthan y
- 3 hours ago
- 2 min read

ఈ మధ్య ఒక కొత్త వ్యాధి ఒకటి వ్యాపించి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. మన శరీరం పై ఏదో ఒకటి కుట్ట గానే ఆ.. అది ఏ దొమో లేదా చీమో అని తేలిగ్గా తీసిపారేస్తాం. అలా చర్మం పై కుట్టి దద్దుర్లు ఏర్పడి ఆ ప్రాంతంలో చర్మం పై నల్లటి మచ్చ ఏర్పడి ఒకటి రెండు రోజుల్లో తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి. అదే ఈ మద్య అందరినీ భయబ్రాంతుల్ని చేస్తున్న వ్యాధి ‘స్క్రబ్ టైఫస్’. నల్లి లాగా ఉండే ఈ పురుగు కుడితే ఈ వ్యాధి వ్యాపిస్తుందట. కొంతమందికి ఈ వ్యాధి గురించి తెలియక ఏదొక మాత్రలు వేసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఇలా చేయడం వలన ప్రాణాలమీదకి తెచ్చుకొనే ప్రమాదము ఉంది. ఇది చూడాటానికి నల్లిలాగే ఉంటుంది. ఈ కీటకం కరవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదము ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటికి వర్షాకాలం మరియు చలికాలం అనుకూలంగా ఉంటాయట. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చూచిస్తుంది. ఈ మధ్య ఈ వ్యాధి సోకిన వారు చనిపోవడం కూడా జరిగింది. ముందుగానే ఈ వ్యాధిని గుర్తించి వైద్య పరీక్షలతో సరైన వైద్యం అంధిస్తే వీటి నుంచి బయట పడొచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
మన ఇంటి చుటూ ఉండే పరిసరాలు పరిశుబ్రంగా ఉండాలి.
ఇంట్లో కీటకాలు, ఎలుకలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఈ కీటకాలు రాత్రి పూట ఎక్కువగా తిరుగుతుంటాయి.
పొలాల్లో, చిన్న చిన్న గడ్డి పొదల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి .
మనం పడుకొనే బెడ్, పరుపు మరియు దిండు ఎప్పటికప్పుడు విధిలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పల్లెటూర్లలో అయితే మన ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ నేల మీద పడుకొని పోతాము. అలాంటప్పు కొంచెం జాగ్రత్త వహించి చుట్టూ గమనించికోవాలి.
పిల్లల పై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పిల్లల కు శరీరం కనిపించకుండా ఉండే దుస్తులు ధరించాలి.
ఇంట్లో మూలన పెడేసిన పాత వస్తువులను అప్పుడప్పుడు శుభ్రం చేస్తా ఉండాలి.
అసలు ఈ వ్యాధి ఏంటి దీన్ని ఎలా ఆపాలి
వ్యాధి పేరు: స్క్రబ్ టైఫస్
బాక్టీరియా రకం: ఒరింయెంటియా సుట్సు గముషి
ఎలా వ్యాపిస్తుంది: నల్లీ లాగే ఉండే ఒక రకమైన కీటకం కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. ఇధి అంటూ వ్యాధి కాదు.
వీటికి ప్రధాన ఆవసాలు: పశువుల పాకలు, గడ్డి పొదలు, కూరగాయల తోటలు, ఎలుకలు, పశువులు శరీరం మరియు ఇతర జంతువుల శరీరం మీద ఇవి ఎక్కువగా ఉండే అవకాశము ఉంది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి యొక్క లక్షణాలు
ఈ కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడటం, దద్దుర్లు, తీవ్ర జ్వరం, నీరసం, తలనొప్పి, శ్వాసకోశ, జీర్ణకోస సమస్యలు. ఈ వ్యాధి సోకిన వెంటనే సరైన వైద్యం అందకపోతే ఊపిరి తిత్తులు, కిడ్నీ ల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వైద్య పరీక్షలు
ఐజియం ఎలీసా, వైల్ – ఫెలిక్స్, ర్యాడిప్ మరియు ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాదిని ముందుగా గుర్తించి తగిన వైద్యం అందిస్తే, వీటి నుంచి బయటపడొచ్చు.



Comments