top of page

గూగుల్ పే లో ఇక నుంచి రీఛార్జి ల పై ఫీజు


google paly

గూగుల్ కి సంబందించిన పేమెంట్ ఆప్ గూగుల్ పే ( Google Pay ) ఇకనుంచి మొబైల్, డిటిఎచ్ రీఛార్జి ల పై ఫీజు వసూలు చేయనుంది. ఇప్పటికే ఫోన్ పే, పెటీఎం లు రీఛార్జి ల పై ఫీజు వసూల్ చేస్తుండగా అదే తరహాలోనే గూగుల్ పే కూడ వెళ్లనుంది. కార్డ్, యుపిఇ ఇలా ఏ తరహా లోనైనా పేమెంట్ చేసేటప్పుడు కన్వీనియన్స్ ఫీజు కింద కొద్ది పాటి ఫీజు ను వసూలు చేయనుంది.    

                                       

ఇన్నాళ్లు ఉచితంగా సేవలు అందించిన గూగుల్ పే ఇప్పుడు ఈ సేవలను ప్రవేశ పెట్టెసరికి గూగుల్ పే యునియోగదారులు అంతా నివ్వెర పోతున్నారు. కానీ ఈ ఫీజు లను అందరి దగ్గర నుంచి వసూలు చేయట్లేదు. కొద్ది మంది ఉనియోగదారుల నుంచి మాత్రమే వసూలు చేస్తుందని చెబుతున్నారు. భవిష్యత్తు లో అందరి దగ్గరి నుంచి వసూల్ చేస్తుందని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ దీని పై గూగుల్ పే ఎక్కడ అధికారంగా ప్రకటించలేదు.

 

ఈ సేవలను డిసెంబర్ 1, 2023 నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి గూగుల్ పే తమ యునియోగ దారులకు ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో   వేచి చూద్దాం.  

     

bottom of page