top of page

సమ్మర్ లో పళ్ల పాయసాన్ని ఇలా తయారుచేయండి


fruit payasam

పళ్ల పాయసం

సమ్మర్ దగ్గర పడుతుంది, ఏదైనా కొత్తగా వెరైటీగా చేసుకొని తినాలనుకుంటున్నారా అయితే ఒకసారి పళ్ల పాయసాన్ని ప్రయతించి చూడండి.  చాలా టేస్ట్ గా ఉంటుంది. మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సమ్మర్ లో చాలా కూల్ గా ఉంటుంది. పిల్లలే కాదు అందరు బాగా ఇష్టంగా తింటారు కూడా.     

 


తయారీకి కావలసిన పదార్ధాలు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

జీడీ పప్పు - పది

బాదం పప్పు - పది

పాలు -ఆరు కప్పులు

వేడి నీళ్లు ఒక కప్పు

కుంకుమ పువ్వు - పావు స్పూన్ 

వేయించిన సేమియా - పావు కప్పు

కస్టర్డ్ పొడి - రెండు స్పూనులు

కండెన్సెడ్ పాలు - అర కప్పు

ఆపిల్, అరటి ముక్కలు - కొద్దిగా

నల్ల ద్రాక్ష - పావు కప్పు

యాలకుల పొడి - కొద్దిగా

దానిమ్మ - అరకప్పు 

 






తయారు చేసే పద్దతి

బాస్మతి బియ్యం, బాదం, జీడిపప్పును అరగంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత బాదం పప్పు మీద ఉన్న పొట్టు ను తీసేసి అన్నింటిని కలిపి మిక్సీ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఓ పెద్ద కడాయి లో పైన చెప్పినంత పాలు పోసి, అందులో కుంకుమ పువ్వు వేసి మరిగించాలి.   ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ను కలపాలి. పది నిమిసాల పాటు ఉడికిన తరువాత అందులో సేమియాను వెయ్యాలి. విడిగా ఒక కప్పు పాల లో కస్టర్డ్ పొడి ని కలిపి కడాయి లో పోయాలి. అవి చిక్కగా అవుతున్నప్పుడు కండెన్సడ్ పాలు ని అందులో కలపాలి. ఇపుడు వాటిని బాగా కలియబెట్టి స్టవ్ ఆప్  చేయాలి. ఈ విధంగా తయారు అయినా మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఆరనివ్వాలి. ఇపుడు మనకు కావాల్సిన పళ్ల పాయసం రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసేటప్పుడు అలంకరణ కోసం దాని పైన తాజా పళ్ల ముక్కలను చేరిస్తే బాగుంటుంది.       

        

 

 

 

bottom of page